1 00:00:08,884 --> 00:00:10,052 నాకో బరీటో కావాలి. 2 00:00:10,177 --> 00:00:12,263 ఎవరైనా పాటలు సంగతి చూస్తారా? 3 00:00:12,346 --> 00:00:13,806 - హలో. - నేనింటికి వెళ్లాలి 4 00:00:13,889 --> 00:00:15,599 నీకు కావాల్సింది బరీటో. 5 00:00:17,643 --> 00:00:18,728 నువ్వంటే ప్రాణం. 6 00:00:21,856 --> 00:00:24,567 - మనం తర్వాత మాట్లాడుకోచ్చు. - అది కేవలం శృంగారం. 7 00:00:26,652 --> 00:00:27,653 నాకు ఈ పాట ఇష్టం. 8 00:00:28,362 --> 00:00:30,364 నాకిష్టం, నాకిష్టం, చాలా ఇష్టం 9 00:00:30,448 --> 00:00:32,950 బరీటో. హలో, బరీటో. 10 00:00:33,242 --> 00:00:36,412 - బహుశా నేను ఇంటికి వెళ్లాలి, మిత్రులారా. - చెత్త బరీటో! 11 00:00:46,839 --> 00:00:47,923 పక్కకు తప్పుకో. 12 00:00:56,724 --> 00:00:58,184 - ఆలిసన్‌ బాగుందా? - లవ్ యూ 13 00:01:13,908 --> 00:01:16,619 ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్ 14 00:01:19,705 --> 00:01:23,334 ఆలిసన్ శ్రద్ధాంజలిపై లెనన్ కారుకూతలు రాసి పంపింది. 15 00:01:24,001 --> 00:01:27,129 నువ్వు ఇంత చేశాక ఆమెను నిందించవచ్చా? 16 00:01:29,173 --> 00:01:30,925 అందరికీ తగినదే చేశాను. 17 00:01:32,885 --> 00:01:34,094 మరి ఎందుకు వచ్చావు? 18 00:01:34,970 --> 00:01:37,598 నిజ జీవితంలో దేవుని పునరుత్థానం ఉండదు. 19 00:01:38,390 --> 00:01:41,101 - నిజ జీవితమా? - అందుకు ప్రజలను అరెస్టు చేస్తారు. 20 00:01:42,269 --> 00:01:44,271 లారా నాకిచ్చిన దానికోసం వచ్చాను. 21 00:01:45,481 --> 00:01:47,900 నేను మీ న్యాయవాదికి ఫోన్ చేశాను. 22 00:01:48,859 --> 00:01:51,946 అది అమ్మగానే డబ్బులు పంపిస్తానని ఆమెకు చెప్పాను. 23 00:01:52,029 --> 00:01:55,241 నాకు డబ్బు పట్టింపు లేదు. నాకు బైబిల్ కావాలి. 24 00:01:57,284 --> 00:01:58,160 నిజమే. 25 00:01:58,244 --> 00:02:02,081 సమయం దగ్గరపడుతోంది. కాలజ్ఞానం భద్రంగా ఉంచడం నా బాధ్యత. 26 00:02:02,164 --> 00:02:04,375 ఎంత అర్ధరహితమో తెలుసా? 27 00:02:06,085 --> 00:02:10,172 ఎంచుకోవడానికి ఇంకా సమయం ఉంది. నీ వచ్చే జన్మ చాలా సంతోషంగా ఉంటుంది. 28 00:02:11,423 --> 00:02:13,050 వాస్తవాన్ని ఎంచుకుంటాను. 29 00:02:16,679 --> 00:02:20,808 మరి లెనన్? ఆమెకు ఎంచుకునే అవకాశం ఉందని తెలుసా? 30 00:02:21,517 --> 00:02:25,020 మనం ఒప్పందం చేసుకున్నాం. ఆమె జోలికి వెళ్లకు. 31 00:02:34,196 --> 00:02:36,740 - ఇది డెలన్ చేశాడా? - నేను అలా ఎప్పుడూ అనలేదు. 32 00:02:37,074 --> 00:02:40,411 చీటో, ఆ కలలుగనే అబ్బాయి నన్ను నెట్టేశాడన్నావా? 33 00:02:40,494 --> 00:02:43,414 అతను అనుమానాస్పదంగా ఉన్నాడని ఎప్పుడూ అనే దానివి. 34 00:02:43,455 --> 00:02:48,210 - అతను సున్నితమైనవాడు అన్నావు. - నేను అలా అనుకున్నాను. గత రాత్రి వరకు. 35 00:02:48,919 --> 00:02:51,547 అతను తన అంగాన్ని చూపించాలనుకున్నాడని చెప్పకు. 36 00:02:51,839 --> 00:02:53,465 తను కిటికీ బయట ఉండగా చూశాను 37 00:02:54,550 --> 00:02:57,845 నేను ఊరకే అన్నాను. అతను హస్తప్రయోగం చేసుకుంటున్నాడా? 38 00:03:01,640 --> 00:03:03,559 అంటే నిన్ను చంపాలని వచ్చాడా? 39 00:03:03,809 --> 00:03:06,478 నాకు తెలియదు. అతను నాకు ఏమీ చేయలేదు, 40 00:03:06,562 --> 00:03:09,940 నేను లోపలకు రానివ్వలేదని క్లారాకు విముక్తి కలిగించానన్నాడు 41 00:03:10,024 --> 00:03:12,151 నేను ఆలిసన్ అని, ఏదేదో అన్నాడు. 42 00:03:12,234 --> 00:03:16,155 ఆగు. ఆపు. వెనక్కి రా. నువ్వు ఆలిసన్ అనుకున్నాడా? 43 00:03:17,364 --> 00:03:18,449 తను ప్రేమించినదా? 44 00:03:19,658 --> 00:03:21,827 నేను కాదని చెప్పాను. కానీ నమ్మలేదు. 45 00:03:21,911 --> 00:03:25,039 ఇదంతా అకారణంగా, అకస్మాత్తుగా మీ కిటికీ బయట జరిగిందా? 46 00:03:25,122 --> 00:03:27,833 అవును. అంటే, స్పష్టంగా, నేను ఆమెలా ఉండను. 47 00:03:27,917 --> 00:03:32,004 అవును. అంత నిరాశగా, చికాకు పుట్టించేలా లేవు. ఏమనుకోవద్దు. 48 00:03:35,507 --> 00:03:37,301 మతిస్థిమితం కోల్పోయి ఉండవచ్చు. 49 00:03:37,676 --> 00:03:39,303 ప్రియురాలు బతికుందనుకుంటే, 50 00:03:39,386 --> 00:03:41,805 అతను నన్నెందుకు చంపడానికి వస్తాడు? 51 00:03:42,723 --> 00:03:44,850 అది అతని ప్రేరణనంతా నాశనం చేస్తుంది. 52 00:03:45,726 --> 00:03:48,771 నువ్వు అన్నట్లుగా, అతను మానసిక రోగి అయితే తప్ప. 53 00:03:49,897 --> 00:03:51,315 మనస్తత్వం బాగా చదవగలను. 54 00:03:52,441 --> 00:03:56,987 జీవితంలో మొదటిసారిగా నేను పొరబడితే బాగుండునని కోరుకుంటున్నాను. 55 00:03:58,906 --> 00:03:59,990 నేను కూడా. 56 00:04:05,579 --> 00:04:07,206 ఒక నేరం గురించి చెబుతాను. 57 00:04:09,458 --> 00:04:12,711 - కూర్చుంటావా? - వద్దు. పరవాలేదు. 58 00:04:19,301 --> 00:04:24,223 తను చెప్పేది పిచ్చిగా అనిపించవచ్చు, కానీ ఆలిసన్ గ్రాంట్ ఆత్మహత్య చేసుకోలేదు. 59 00:04:25,474 --> 00:04:29,687 ఆమె సోదరి లెనన్ చనిపోతే, ఆలిసన్ ఆమె గుర్తింపును దొంగిలించింది. 60 00:04:30,562 --> 00:04:33,065 - సరే. - అది చట్టవిరుద్ధం. 61 00:04:33,691 --> 00:04:37,820 - అది తప్పక కావచ్చు. - నేను చదివాను. అది కనీసం మోసం. 62 00:04:38,278 --> 00:04:41,824 - ఈ మోసం గురించి నీ దగ్గర ఆధారాలున్నాయా? - అదే నాకు చెప్పింది. 63 00:04:43,534 --> 00:04:49,498 మన్నించండి. అంటే ఆలిసన్ ఈ మోసం గురించి గత రాత్రి చెప్పింది. 64 00:04:50,916 --> 00:04:54,920 గ్రాంట్ ఇంటి ముందు నువ్వు బెదిరిస్తుండగా జరిగిందా? 65 00:04:56,547 --> 00:04:57,589 ఏంటి? 66 00:04:57,673 --> 00:05:01,427 బ్రూస్ ఫోన్ చేశాడు. నువ్వు ఇరుకున పడకూడదని లెనన్ కోరుకుంటోంది, 67 00:05:01,510 --> 00:05:03,929 కానీ నీ మానసిక స్థితి గురించే అతని ఆరాటం. 68 00:05:04,013 --> 00:05:06,390 దీనికి నా మానసిక స్థితికి సంబంధం లేదు. 69 00:05:08,017 --> 00:05:11,854 నువ్వు ఎన్నోసార్లు లెనన్ వెంటపడడం అతని వీడియోలో ఉంది. 70 00:05:11,937 --> 00:05:14,857 ఆమె వెంటపడలేదు. ఏదో దాచడానికి అబద్ధం ఆడుతున్నారు. 71 00:05:15,482 --> 00:05:20,529 నిజమైన లెనన్‌ను ఆలిసన్ చంపేసింది. నేను ఎవరికీ చెప్పనని మాటిచ్చాను. 72 00:05:21,405 --> 00:05:25,868 - జరిగింది అది. నువ్వు ఆమెను చంపాం. - నీ మనసు బాగాలేనట్లుంది, కదా? 73 00:05:25,951 --> 00:05:28,620 నువ్వు కూర్చుంటే, నేను సోడా తెస్తాను... 74 00:05:28,704 --> 00:05:31,915 నాకు సోడా వద్దు. మేము లెనన్‌ను చంపాం. 75 00:05:31,999 --> 00:05:36,128 ఆమె నడుపుతుందని అనుకున్నాం, కానీ నిజానికి అది ఆలిసన్. ఆమెను గుద్దేశాం. 76 00:05:36,420 --> 00:05:40,257 నిజమైన లెనన్. ఆమెతో పడుకున్నాక, మేము కెటమైన్ తీసుకుని, 77 00:05:40,340 --> 00:05:44,511 ఆమె శవాన్ని గుహలో వదిలేశాం. మీరు ఆమెను అరెస్టు చేయాలి. 78 00:05:44,636 --> 00:05:46,680 కావాలంటే నన్ను కూడా ఖైదు చేయండి. 79 00:05:46,764 --> 00:05:49,099 - కూర్చో. - నాకు కూర్చోవాలని లేదు. 80 00:05:49,183 --> 00:05:54,021 విను, డిలన్. ఈ ఆప్తులు ఎందరో చనిపోయారు. 81 00:05:54,104 --> 00:05:56,398 నువ్వు చాలా అలసిపోయావు. 82 00:05:56,690 --> 00:05:59,526 కానీ నువ్వు మాట్లాడే దానికి నిజంగా అర్థం లేదు. 83 00:05:59,610 --> 00:06:01,487 నువ్వు ఇబ్బందుల్లో పడవచ్చు. 84 00:06:01,779 --> 00:06:05,032 అందుకే నేను సంఘసేవ వాళ్లను పిలుస్తాను, సరేనా? 85 00:06:05,115 --> 00:06:08,035 - మీ అమ్మలకు ఫోన్ చేయాలా? - మీరు ఆ పని చేయవద్దు. 86 00:06:08,118 --> 00:06:12,081 - మీ పని మీరు చూసుకోండి. - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. 87 00:06:16,543 --> 00:06:19,171 నువ్వు చెప్పే దానికి ఏదైనా ఆధారం ఉందా? 88 00:06:19,463 --> 00:06:21,673 ఈ కథనానికి ఎవరైనా సాక్ష్యం ఇస్తారా? 89 00:06:22,800 --> 00:06:26,678 వాళ్లంతా చనిపోయారు. మార్గో తప్ప. 90 00:06:26,762 --> 00:06:29,556 గ్రాడ్యుయేషన్ పార్టీ తర్వాత. ఆమె కారులో ఉంది. 91 00:06:29,640 --> 00:06:33,644 లెనన్‌లా నటిస్తూ ఆలిసన్ నడిపిన కారులోనా? 92 00:06:33,727 --> 00:06:37,731 చంటి పిల్లాడిని అన్నట్లు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకా చనిపోతారు. 93 00:06:37,815 --> 00:06:40,692 - అది నీకు ఎలా తెలుసు? - నాకు తెలుసు అంతే. 94 00:06:48,117 --> 00:06:48,992 హేయ్. 95 00:06:51,036 --> 00:06:52,746 దేవుడా, కాఫీ ఘోరంగా చేస్తాను. 96 00:06:52,913 --> 00:06:55,165 పక్కనే హోటల్ ఉండడం మంచిదయింది. 97 00:06:55,916 --> 00:06:57,709 ఎలా ఉన్నావో చూద్దామనుకున్నాను. 98 00:07:01,255 --> 00:07:02,548 బాగా లేను. 99 00:07:06,260 --> 00:07:10,514 - డిలన్‌కు చెప్పానంటే నమ్మలేకపోతున్నాను. - పరవాలేదు. మనం చూసుకుంటాం. 100 00:07:10,848 --> 00:07:13,058 కొన్నాళ్ల ఇంకా జాగ్రత్తగా ఉండాలి. 101 00:07:14,935 --> 00:07:15,978 మార్గో ఎలా ఉంది? 102 00:07:18,856 --> 00:07:20,899 ఆమె గురించి చింతించాల్సిన పనిలేదు. 103 00:07:22,651 --> 00:07:25,320 నేను ఏమనుకుంటున్నానంటే డిలన్... 104 00:07:28,824 --> 00:07:31,034 నాకు ఏమైందో తెలియదు. 105 00:07:34,246 --> 00:07:36,832 కొన్నిసార్లు మనుషులు మనం అనుకున్నట్లు ఉండరు. 106 00:07:38,375 --> 00:07:40,502 సందర్భం వస్తే, పొరబడ్డాడని చెప్పు. 107 00:07:41,336 --> 00:07:45,716 - కవలలకు ఎప్పుడూ అలాగే జరుగుతుంది. - కానీ ఇప్పుడు ఒక్కరే మిగిలారు. 108 00:07:56,059 --> 00:07:58,520 ఆమె చేసిందల్లా అందరినీ అసహ్యించుకోవడమే. 109 00:07:58,604 --> 00:08:02,149 - మనం ఆమెను గుహకు తీసుకెళ్లచ్చు. - ఆమె పారిపోయిందని చెబుదామా? 110 00:08:03,609 --> 00:08:05,986 మనం ఆమెను గుహలో ఉంచితే ఎవరికీ దొరకదు. 111 00:08:06,612 --> 00:08:08,322 స్నేహితులు ఉన్నారని కాదు. 112 00:08:09,573 --> 00:08:11,575 ఆలిసన్‌కు ఏం కావాలి అనుకుంటావు? 113 00:08:23,212 --> 00:08:25,714 బంగారం? వచ్చిన వాళ్లను కలుస్తావా? 114 00:08:27,424 --> 00:08:31,470 - హేయ్. కొంచెం సేపే. - తప్పకుండా. 115 00:08:35,307 --> 00:08:36,683 అంతా బాగానే ఉందా? 116 00:08:37,059 --> 00:08:40,103 ఆలిసన్ గ్రాంట్ ఆత్మహత్య గురించి వాకబు చేద్దామని. 117 00:08:41,647 --> 00:08:45,317 ముందే చెప్పాను, ఆలిసన్ నా స్నేహితురాలు కాదు. 118 00:08:45,400 --> 00:08:48,737 గుర్తుంది. ఇలాంటివి మళ్లీ జరగకుండా వీలైనంత ఎక్కువ సమాచారం 119 00:08:48,820 --> 00:08:51,615 రాబట్టడానికి ప్రయత్నిస్తాం. 120 00:08:52,741 --> 00:08:56,745 మానసిక ఆరోగ్యం గురించి మరింత తెలిసుంటే మంచిది. 121 00:08:57,537 --> 00:08:58,455 ఒప్పుకుంటాను. 122 00:09:01,750 --> 00:09:05,170 - మీకు తినడానికి, తాగడానికి తీసుకురావాలా? - పరవాలేదు, వద్దు. 123 00:09:05,629 --> 00:09:09,216 ఆలిసన్ కనిపించకుండా పోవడానికి ముందు ఏదైనా తేడాగా అనిపించిందా? 124 00:09:09,925 --> 00:09:12,177 అది మీ గ్రాడ్యుయేషన్ రాత్రి, కదా? 125 00:09:12,427 --> 00:09:16,473 ఆలిసన్ ఎప్పుడు తేడాగానే ఉండేది, బాధాకరంగా. 126 00:09:16,723 --> 00:09:18,934 అవును, డిప్రెషన్ వల్ల అలా జరుగుతుంది. 127 00:09:19,101 --> 00:09:24,147 నిజమే. నేను కూడా అనుభవించాను. దానితో ఇంకా యాంగ్జైటీతో. 128 00:09:25,023 --> 00:09:26,024 అర్థం చేసుకోగలను. 129 00:09:26,900 --> 00:09:31,446 అయితే పార్టీ తర్వాత మీరు కలిసి ఉన్నప్పుడు నీకెలాంటి తేడా కనిపించలేదా? 130 00:09:31,905 --> 00:09:33,657 పార్టీ తర్వాత మేము కలవలేదు. 131 00:09:33,907 --> 00:09:38,537 పార్టీకి చాలా ఆలస్యమైంది, గుర్తుందా? మీరు అక్కడికి వచ్చి బ్లూస్‌కు లైన్ వేశారు. 132 00:09:38,704 --> 00:09:40,414 నాకు అలా గుర్తు లేదు. 133 00:09:41,873 --> 00:09:44,918 అయితే ఆలిసన్ వెళ్లిపోయాక నువ్వు ఆమెను కలవలేదా? 134 00:09:45,460 --> 00:09:50,716 నేనెందుకు కలుస్తాను? నా స్నేహితురాలు ఆమె కాదు, లెనన్ అని చెప్పాను. 135 00:09:50,924 --> 00:09:55,137 పాపం ఆ కుటుంబం. నా కూతురును పోగొట్టుకోవడం ఊహించుకోలేను. 136 00:09:58,807 --> 00:09:59,683 ధన్యవాదం, మే. 137 00:09:59,766 --> 00:10:02,227 అమ్మాయిల పార్టీకి సిద్ధమైనప్పుడు చెప్పు. 138 00:10:16,366 --> 00:10:18,952 - హేయ్, మే. - బ్రూస్, ఎలా ఉన్నావు? 139 00:10:19,036 --> 00:10:22,789 ఎప్పటిలాగే అద్భుతంగా ఉన్నాను. మార్గో ఎలా ఉంది? 140 00:10:22,873 --> 00:10:28,128 ఆమె చాలా బాగుంది. నిజానికి ఆమెను కలవడానికి నీ ప్రియమైన కాబోయే భార్య వచ్చింది. 141 00:10:28,420 --> 00:10:31,715 ఆలిసన్ కేసు రాత పని పూర్తి చేయడానికి వచ్చానని చెప్పింది. 142 00:10:31,798 --> 00:10:34,509 అది పెద్ద విషయం కాదు. కేవలం నీకు... 143 00:10:34,593 --> 00:10:37,637 ఎవరైనా నా కూతురు గురించి అడిగితే, నీకు తెలుసుగా? 144 00:10:38,263 --> 00:10:41,266 - అవును, తప్పకుండా, మే. ధన్యవాదాలు. - పరవాలేదు. 145 00:10:54,863 --> 00:10:56,239 లెనన్ 146 00:10:56,323 --> 00:10:59,951 ఆమె ఇది ఆత్మహత్య నిరోధక కార్యక్రమం అన్నట్లు నటించింది. 147 00:11:00,410 --> 00:11:03,455 - అదెంత ఘోరంగా ఉంది? - డెలన్వింతగా ఉన్నాడని చెప్పాను. 148 00:11:03,538 --> 00:11:07,042 దాని అర్థం హంతకుడని అనుకున్నాను, గూఢచారి అని కాదు. 149 00:11:07,125 --> 00:11:10,295 రెండూ కావచ్చు. హంతకులు పోలీసుల దగ్గరకెళ్లి, 150 00:11:10,379 --> 00:11:14,132 తమ తెలివిని బయటపెట్టడానికి పట్టుబడటమో, మరేదో చేస్తారు కదా? 151 00:11:15,008 --> 00:11:18,428 సామాన్యంగా తెలివైనవారు. యూనాబాంబర్ హార్వర్డ్‌లో చదివాడు. 152 00:11:20,013 --> 00:11:21,973 డెలన్చెబుతాడంటే నమ్మలేకపోతున్నా. 153 00:11:22,349 --> 00:11:25,977 మరో విధంగా అనుకోవడానికి ఏం లేదు. ఆందోళనగ ఉంది. 154 00:11:26,937 --> 00:11:28,730 చాలా నీళ్లు తాగాను. 155 00:11:35,862 --> 00:11:37,656 అయితే మనం ఏం చేయాలి? 156 00:11:37,739 --> 00:11:41,660 మామూలుగా ఉండడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. తలుపులకు తాళం వేసుకోవాలి. 157 00:11:42,244 --> 00:11:44,955 నిజమే. అతను ఏం చెప్పాడో మనకు తెలియదు, అందుకే... 158 00:11:53,672 --> 00:11:54,840 అనుమానంగా ఉంది. 159 00:11:56,967 --> 00:11:57,884 ఏంటి? 160 00:12:02,013 --> 00:12:07,018 ఏడాదిపాటు ఆ పెంట నోరు మూసుకుని, 161 00:12:07,102 --> 00:12:09,604 అకస్మాత్తుగా ఆ చుప్పనాతి దగ్గరకు వెళ్లాడు. 162 00:12:09,855 --> 00:12:11,064 అవును, నాకు తెలుసు. 163 00:12:12,774 --> 00:12:16,153 నిన్న రాత్రి నేను వెళ్లిపోయాక, 164 00:12:17,070 --> 00:12:21,283 జీవితంపై అతని దృక్పథం మారేలా ఏమైనా జరిగిందా? 165 00:12:21,783 --> 00:12:24,619 నా పై గూఢచార్యానికి పట్టుకోవడం కాకుండానా? లేదు. 166 00:12:30,375 --> 00:12:33,295 మానసిక రోగి మనసులో ఏముంటుందో మనం ఎప్పుడూ చెప్పలేం. 167 00:12:45,599 --> 00:12:48,852 - ఏదైనా బేరం కోసం చూస్తున్నావా? - కేవలం ఆరా తీస్తున్నాను. 168 00:12:50,103 --> 00:12:53,940 - లెనన్‌కు చలాన్ ఏమైనా పడిందా? - లేదు. ఈ ఉదయం డెలన్నన్ను కలిశాడు. 169 00:12:55,609 --> 00:12:58,320 - ఎలా ఉన్నాడు? - నువ్వు అన్నట్టుగా బాగాలేడు. 170 00:12:58,737 --> 00:13:00,405 కారు ఢీకొట్టి లెనన్‌ను చంపి, 171 00:13:00,489 --> 00:13:04,493 ఆమె గుర్తింపును ఆలిసన్ దొంగిలించిందని వింత కథ చెప్పాడు. 172 00:13:04,576 --> 00:13:06,620 తర్వాత సెక్స్, కెటమైన్‌ల గురించి. 173 00:13:09,414 --> 00:13:10,290 అవును. 174 00:13:10,582 --> 00:13:13,710 ఈ జీప్‌ను తీసుకెళ్లి పరీక్షించడం లాంటిది ఏదైనా చేయాలా? 175 00:13:14,586 --> 00:13:18,590 ఏం అర్థం కావడం లేదు. అతన్ని కలవమని సంఘసేవ వారికి చెప్పాను. 176 00:13:18,924 --> 00:13:22,344 నేను హన్నాలకు కూడా ఫోన్ చేయాలి. 177 00:13:22,552 --> 00:13:24,471 అవును. ఆ పని చేస్తే బాగుంటుంది. 178 00:13:26,097 --> 00:13:30,560 - వచ్చాను కాబట్టి భోజనం చేద్దామా? - నాకు అంతగా ఆకలి లేదు. 179 00:13:30,977 --> 00:13:32,395 భోజనం అంటే శృంగారం. 180 00:13:32,687 --> 00:13:36,191 - నిజమే. అయితే నాకు చాలా ఆకలిగా ఉంది. - అవును. 181 00:13:42,447 --> 00:13:44,783 మేకల అమ్మకం 182 00:14:06,680 --> 00:14:07,889 ఏం చేస్తున్నావు? 183 00:14:08,557 --> 00:14:10,892 నువ్వు లెనన్‌తో పడుకున్నావా? 184 00:14:10,976 --> 00:14:14,563 - ఆమె లెనన్ కాదు, ఆలిసన్. - అలా అరుస్తున్నావని ఆమె చెప్పింది. 185 00:14:14,646 --> 00:14:17,774 - ఇక వెళ్లు, మార్గో. - వద్దు. దయచేసి విను. 186 00:14:22,070 --> 00:14:27,617 ఆమె చెత్తబుట్టలో ఉన్న వాడిన కండోమ్ నీదా అని తెలుసుకోవాలనుకుంటున్నాను. 187 00:14:32,455 --> 00:14:33,290 ఎందుకు? 188 00:14:33,373 --> 00:14:36,835 ఆమె నీతో పడుకున్న విషయం నాతో అబద్ధం చెబితే, 189 00:14:39,546 --> 00:14:41,548 ఆమె గురించి చెప్పేది నమ్ముతాను. 190 00:14:44,217 --> 00:14:46,803 ఆమె నాతో పడుకున్నాక అసలు తానెవరో చెప్పింది. 191 00:14:55,729 --> 00:14:56,813 రా. 192 00:14:58,523 --> 00:14:59,733 ఇక్కడ మాట్లాడుదాం. 193 00:15:15,665 --> 00:15:18,168 ఇది అసలైన వ్యాపారం అన్నట్లు నటించవా? 194 00:15:18,251 --> 00:15:20,587 సంఘసేవకులు. ఫోన్ చేస్తూ ఉన్నారు. 195 00:15:21,254 --> 00:15:25,091 నీకు నిజంగా వైద్యం కావాలి. ఆ చుప్పనాతి దగ్గరకు ఎందుకు వెళ్లావు? 196 00:15:26,051 --> 00:15:29,929 - ఆమె పోలీస్ చీఫ్. - ఊ. అందుకే బ్రూస్ ఆమెతో పడుకుంటున్నాడు. 197 00:15:30,430 --> 00:15:34,267 ప్రకృతి డాక్యుమెంటరీలు చూడవా? పిల్లల రక్షణకై తండ్రులు చంపేస్తారు. 198 00:15:34,351 --> 00:15:37,604 ఆ పని తల్లులు చేస్తారు. తమ పిల్లలను తిననివాళ్లు. 199 00:15:40,023 --> 00:15:41,358 చండాలపు మాటలు. 200 00:15:43,610 --> 00:15:45,278 లైలా మంచి మనిషి అనుకున్నాను. 201 00:15:46,112 --> 00:15:49,866 మంచి వాళ్లు లేరు. లెనన్ ఏం చేసిందో ఆలోచించు. 202 00:15:52,911 --> 00:15:54,746 నేను దేని గురించి ఆలోచించలేను. 203 00:15:56,456 --> 00:15:57,415 నేను కూడా. 204 00:16:02,545 --> 00:16:04,506 ఆమె, బ్రూస్ కలిసి చంపారేమో. 205 00:16:05,548 --> 00:16:09,803 ఆ యాక్సిడెంట్ గురించి తెలిసినందుకు కాదు, బ్రతికున్నది ఎవరో వారికి తెలుసు. 206 00:16:10,595 --> 00:16:14,933 - ఆలిసన్ గురించి జానీకి బాగా తెలుసు. - అవును. ఆలిసన్ అంటే డేల్‌కు పిచ్చి. 207 00:16:15,016 --> 00:16:17,769 అతను మోజు పడ్డప్పుడు ఆమె కన్యలా ప్రవర్తిస్తే, 208 00:16:17,852 --> 00:16:19,354 ఏదో తేడా గుర్తిస్తాడు. 209 00:16:19,479 --> 00:16:21,940 - కన్య కాదు. - అర్థమైంది. నీ కండోమ్ చూశాను. 210 00:16:22,440 --> 00:16:25,610 దానికి అర్థం ఉంది, కానీ రైలీ సంగతి ఏంటి? 211 00:16:26,027 --> 00:16:29,739 అయితే ఆమె హత్య జరిగిన రోజు 212 00:16:30,198 --> 00:16:32,909 లెనన్ అనుమానాస్పదంగా ఉందని ఆమె చెప్పింది. 213 00:16:33,201 --> 00:16:35,328 బ్రూస్ జాగ్రత్తగా కోర్ట్నీని చంపాడు. 214 00:16:35,870 --> 00:16:38,998 నన్ను కిటికీలోంచి తోసేసింది అతనే అని ధీమాగా చెప్పగలను. 215 00:16:39,457 --> 00:16:42,502 - బాగున్నాను. ధన్యవాదాలు. - నిన్ను చంపడానికి వస్తాడా? 216 00:16:42,585 --> 00:16:45,380 క్లారా చనిపోయినందువల్ల వారికొక బలిపశువు కావాలి. 217 00:16:45,463 --> 00:16:47,716 బ్రూస్ ఆమె ప్రేమను వాడుకుని ఉంటాడు. 218 00:16:47,799 --> 00:16:49,551 క్లారాకు దీనికి సంబంధం లేదు. 219 00:16:49,634 --> 00:16:52,303 నువ్వు ఆమెకు గుహలో కనిపించిన రాత్రి ఏమైంది? 220 00:16:52,470 --> 00:16:55,390 నీకు అర్థం కాదు. మనం ఎఫ్‌బీఐకి చెప్పాలి. 221 00:16:56,307 --> 00:16:59,394 నీకేమైనా పిచ్చి పట్టిందా? 222 00:16:59,769 --> 00:17:02,897 ఆధారాలు లేనిదే మనం ఎక్కడికి వెళ్లకూడదు. 223 00:17:08,319 --> 00:17:12,323 - అదేంటి? - కంప్యూటర్. నువ్వు ఎమ్ఐటీకి వెళ్లావు. 224 00:17:12,615 --> 00:17:14,909 హ్యాక్ చేసేందుకు లెనన్ గదిలోంచి తీశా. 225 00:17:15,201 --> 00:17:17,912 హంతకుడు పంపిన వీడియోలు ఏవైనా దొరుకుతాయేమో చూడు. 226 00:17:19,038 --> 00:17:20,248 నువ్వు ఏం చేస్తావు? 227 00:17:20,749 --> 00:17:23,001 అమ్మ నాకై కైల్‌ను పంపేలోపు ఇంటికెళ్లి, 228 00:17:23,084 --> 00:17:27,005 నేరం ఒప్పించే మార్గం ఆలోచిస్తాను. 229 00:17:28,423 --> 00:17:29,966 ప్రాణాలు పోగొట్టుకోకుండా. 230 00:17:35,972 --> 00:17:38,600 - ధన్యవాదాలు. - దేనికి? 231 00:17:40,393 --> 00:17:41,478 నన్ను నమ్మినందుకు. 232 00:17:45,648 --> 00:17:46,649 ఆమె నా ప్రాణం. 233 00:18:00,830 --> 00:18:03,166 ఇక్కడ ఉన్నాను 234 00:18:17,639 --> 00:18:20,934 తిరిగి వస్తాను 235 00:18:38,868 --> 00:18:41,830 - దీని గురించి లెనన్ ఏమనుకుంటోంది. - దేని గురించి? 236 00:18:42,831 --> 00:18:44,457 మన పెళ్లి గురించి. 237 00:18:46,167 --> 00:18:47,252 నిజమే. 238 00:18:48,920 --> 00:18:51,548 అది మర్చిపోయావని అనుకున్నాను. 239 00:18:52,590 --> 00:18:53,883 నిజంగానే అంటున్నాను. 240 00:18:54,050 --> 00:18:57,428 ఆమె ఆ రాసలీలల వీడియో చూశాక, తనకు నేను నచ్చనని తెలుసు. 241 00:18:58,471 --> 00:19:00,348 అది నీకు కూడా తెలుసు. 242 00:19:02,183 --> 00:19:07,814 అది సరైనది కాదు, కానీ ఆమె పరవాలేదు. 243 00:19:09,065 --> 00:19:11,317 చాలా కాలం ఆమె కాలేజీలోనే ఉంటుంది. 244 00:19:12,277 --> 00:19:14,279 ఈ మధ్య చాలా బాధలు పడిందని తెలుసు. 245 00:19:51,733 --> 00:19:54,277 హాయ్. మీరు క్యాబిన్‌ల కోసం చూస్తుంటే, అవి... 246 00:19:56,779 --> 00:19:57,697 అమ్మా? 247 00:20:01,993 --> 00:20:03,036 ఆలినస్? 248 00:20:08,041 --> 00:20:09,500 చనిపోయావనుకున్నాను. 249 00:20:13,463 --> 00:20:15,590 నువ్వు అందుకే వచ్చావా? 250 00:20:18,051 --> 00:20:21,763 నిజానికి మీ నాన్నతో మాట్లాడాలి. నేను కారులో వేచి ఉంటాను. 251 00:20:21,846 --> 00:20:25,475 వద్దు, ఆగు. మనం మాట్లాడుకుందామా? కాసేపే. 252 00:20:27,143 --> 00:20:28,895 నీకు కొత్త నెక్లెస్ ఉంది. 253 00:20:30,229 --> 00:20:34,651 - అది నీకు అనవసరం. - మరొకటి నేను ప్రతి రోజూ వేసుకునే దాన్ని... 254 00:20:36,152 --> 00:20:37,779 అది నువ్వు... 255 00:20:40,281 --> 00:20:41,407 ఉంటే... 256 00:20:43,618 --> 00:20:45,578 నేను ఏం తప్పు చేశాను? 257 00:20:46,579 --> 00:20:47,705 ఎందుకు... 258 00:20:49,749 --> 00:20:51,584 నేనంటే నీకెందుకు అంత అసహ్యం? 259 00:20:53,670 --> 00:20:56,172 నీకు చెప్పాను. ఇక నువ్వు ముందుకు సాగాలి. 260 00:20:58,967 --> 00:21:04,597 నవ్వులాటగా ఉందా? నేను 11 సంవత్సరాలుగా భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. 261 00:21:04,847 --> 00:21:10,019 నేను ప్రతిరోజు అనుకున్నది ఏమిటంటే, నువ్వు ఇక్కడికి వస్తే 262 00:21:11,229 --> 00:21:14,023 నాకు ఒంటరితనం, నాశనమయ్యాననే భావన ఉండవని. 263 00:21:14,148 --> 00:21:19,028 ఇప్పుడు నువ్వు వచ్చావు. కనీసం నాతో మాట్లాడవా? 264 00:21:19,362 --> 00:21:23,741 అంటే, అసలు చనిపోయినట్లు ఎలా నటిస్తావు? 265 00:21:24,951 --> 00:21:26,285 నువ్వెలా చేయగలవు? 266 00:21:29,080 --> 00:21:31,290 రెండు ఒకటే కాదు. మరో మార్గం లేదు. 267 00:21:31,374 --> 00:21:32,291 నాకు కూడా. 268 00:21:32,375 --> 00:21:35,086 అవును, నీకు ఉంది. మాకు నిజం చెప్పాల్సింది. 269 00:21:35,169 --> 00:21:38,131 ఇక్కడున్నంతకాలం ప్రతిరోజు చనిపోవాలని అనుకున్నాను. 270 00:21:45,221 --> 00:21:49,559 - నా కుటుంబానికి దూరం అయ్యాను. - మేము ఇక్కడే ఉన్నాం. 271 00:21:50,893 --> 00:21:52,603 నా అసలైన కుటుంబం చనిపోయింది. 272 00:21:58,317 --> 00:22:00,737 నాన్నను పెళ్లి చేసుకొని నటించాలని చూశాను, 273 00:22:01,696 --> 00:22:03,156 కానీ అలా జరగలేదు. 274 00:22:04,699 --> 00:22:06,743 ఉపాసకులే నీ నిజమైన కుటుంబమా? 275 00:22:08,202 --> 00:22:12,248 అది అల్ప మనస్కుల పదం. నువ్వు ఆ పదం వాడడంలో ఆశ్చర్యం లేదు. 276 00:22:12,999 --> 00:22:14,625 మా సమాజం 277 00:22:16,753 --> 00:22:20,048 ప్రేమ, నిజం, నమ్మకాలపై ఆధారపడింది. 278 00:22:21,549 --> 00:22:26,471 - మీ నాన్న తిరస్కరించినవి. - అయితే, ఫ్రెడ్ కోసం మమ్మల్ని వదిలేశావా? 279 00:22:26,554 --> 00:22:29,682 తను పనిపై వెళ్లినప్పుడు, మాలో చాలా మందిని కోల్పోయాం. 280 00:22:31,476 --> 00:22:33,102 అతనికి నిజమైన ప్రేమ తెలుసు. 281 00:22:33,436 --> 00:22:36,314 మమ్మల్ని ప్రేమించే దానివి, కదా? నాకు గుర్తుంది. 282 00:22:36,397 --> 00:22:39,150 కథలు చదివి, నేను భయపడితే పక్కన పడుకునే దానివి. 283 00:22:39,233 --> 00:22:43,988 - నువ్వు ఎప్పుడూ అంతా అతనిలాంటి దానివే. - ఇలాంటి దాన్ని. అందరూ అనేవారు. 284 00:22:44,072 --> 00:22:48,117 లేదు. మీ ఇద్దరిలో ఏదో తప్పు ఉంది. 285 00:22:53,998 --> 00:22:55,083 తూ. 286 00:22:55,166 --> 00:22:57,710 వచ్చే జన్మలో సంతోషంగా ఉండటం నీ చేతిలో ఉంది. 287 00:22:57,794 --> 00:23:01,714 ఎందుకంటే నువ్వు ఇది నాశనం చేసినందుకా? నువ్వు చనిపోయుంటే బాగుండేది. 288 00:23:10,264 --> 00:23:13,684 నువ్వు ఏం చేయకుంటే, జనాలు తమకు కావలసింది తీసుకుపోతారు. 289 00:23:13,768 --> 00:23:16,437 ఇంకా ఏం మిగిలింది? అంతా తీసుకెళ్లావుగా. 290 00:23:18,022 --> 00:23:20,608 నీ సోదరిగా ఉండడం ఎంత కష్టమో నీకు తెలుసా? 291 00:23:20,691 --> 00:23:22,735 నీ సోదరిగా ఉండడం ఇంకా కష్టం. 292 00:23:22,819 --> 00:23:25,196 పాపం ఆలిసన్ ఎలా ఉందో రోజంతా చింతిస్తాను. 293 00:23:25,279 --> 00:23:27,115 పాపం ఆలిసన్ బాగుండేలా చూడాలి. 294 00:23:27,198 --> 00:23:29,367 నువ్వు వెళ్లిపోతే ఆలిసన్ బాగుంటుంది. 295 00:23:29,450 --> 00:23:31,702 ఇదిగో. ఎప్పటిలాగే నన్నే నిందించు. 296 00:23:31,994 --> 00:23:36,374 అవును. నువ్వు పోతే బాగుండునని ప్రతిరోజు ప్రార్థిస్తాను. 297 00:23:38,167 --> 00:23:40,044 వెళ్లిపోతాను. త్వరలోనే. 298 00:23:41,671 --> 00:23:45,967 పోవడమంటే మిషిగన్ వెళ్లిపోవడం కాదు. చచ్చిపోయి వెళ్లిపోవడం. 299 00:23:52,515 --> 00:23:55,726 ఆమె చెప్పినట్లుగా నిజంగానే నాలోనే ఏదైనా లోపం ఉంటే? 300 00:23:56,853 --> 00:24:00,523 అది నిర్ణయించడానికి ఆమె ఎవరు? ఆమె చనిపోయినట్లు నటించింది. 301 00:24:02,441 --> 00:24:03,943 అయినా ఆమె మా అమ్మ. 302 00:24:04,986 --> 00:24:08,489 ఆమె నిన్ను పదేళ్లుగా చూడలేదు. 303 00:24:09,740 --> 00:24:11,325 ఆమెకు నువ్వెవరో తెలియదు. 304 00:24:20,459 --> 00:24:21,627 నీకు కూడా. 305 00:24:25,965 --> 00:24:27,425 ఆడియో రికార్డు 306 00:24:28,092 --> 00:24:32,138 నువ్వు వెనుక ముందు ఆలోచిస్తూ ఆటలాడే సమయం కాదిది. 307 00:24:32,555 --> 00:24:34,974 ఊరికే కాదు. నా పరిస్థితి అధ్వానంగా ఉంది. 308 00:24:35,433 --> 00:24:39,437 ఏ విధంగా? నీ అశ్లీల ఛానల్, గుహ విషయం కాకుండా. 309 00:24:39,520 --> 00:24:40,897 ఊరుకోవే. 310 00:24:41,147 --> 00:24:44,483 నువ్వంటే నాకు ప్రాణమని చెబుతున్నాను అంతే. 311 00:24:45,860 --> 00:24:48,696 ఇంకా నీ అధ్వాన పరిస్థితి గురించి 312 00:24:50,781 --> 00:24:52,700 నువ్వు ఏం చెప్పినా అది మారదు. 313 00:25:00,917 --> 00:25:02,210 అవును, మారుతుంది. 314 00:25:06,631 --> 00:25:09,967 ప్రయత్నించు. నేను పారిపోతానేమో చూడు. 315 00:25:12,220 --> 00:25:13,471 ఇంకా పారిపోలేదు. 316 00:25:14,347 --> 00:25:17,433 నేను ఏం చేయగలనో నీకు తెలియదు కాబట్టి. 317 00:25:28,444 --> 00:25:31,656 - ఇక్కడేం చేస్తున్నావు? - కాంపౌండ్ దగ్గర బైబిల్ లేదు. 318 00:25:32,156 --> 00:25:35,326 - అది ఇక్కడ లేదు. - వెతకడానికి నాకు సహాయం చేయు. 319 00:25:38,788 --> 00:25:42,333 - నేను చేయలేను. - ఆలిసన్‌ను కలిశాను. 320 00:25:45,962 --> 00:25:48,047 ఇంకా అలాగే మొండిగా ఉంది. 321 00:25:48,756 --> 00:25:51,801 అమె తన సోదరి స్థానంలోకి వచ్చిందంటే, 322 00:25:51,884 --> 00:25:54,345 మీరు ఎలాంటి పనులు చేసుంటారో ఊహించగలను. 323 00:25:59,100 --> 00:26:01,560 నువ్వు ఎక్కడ ఉన్నావో ఫ్రెడ్‌కు తెలియదుగా? 324 00:26:02,395 --> 00:26:05,564 నువ్వు ఇక్కడ ఉండడం ఎంత ప్రమాదకరమో అతనికి తెలుసు. 325 00:26:06,941 --> 00:26:08,317 నాకు బైబిల్ కావాలి. 326 00:26:13,322 --> 00:26:18,244 నువ్వు వెళ్లిపోయాక పోలీసులు దాన్ని ఆధారంగా తీసుకున్నారేమో తెలుసుకుంటాను. 327 00:26:41,475 --> 00:26:44,270 నా దగ్గర చాలా బలమైన జీవ ఆధారాలున్నాయి. 328 00:26:45,521 --> 00:26:46,647 నాకు వినబడడం లేదు. 329 00:26:49,483 --> 00:26:52,903 నా దగ్గర చాలా బలమైన జీవ ఆధారాలున్నాయని అన్నాను. 330 00:26:52,987 --> 00:26:54,739 కవలల జన్యువుల్లో తేడా ఉండదు. 331 00:26:54,822 --> 00:26:58,284 తెలుసు, మరీ టెక్కులొద్దు. మనం కలిసి సైన్స్ చదువుకున్నాం. 332 00:26:59,035 --> 00:27:02,371 - వాళ్ల అమ్మ ఇంకా బ్రతికే ఉంది. - నిజంగానా? 333 00:27:03,497 --> 00:27:04,582 ఛ. 334 00:27:04,665 --> 00:27:06,959 లెనన్‌ను వాళ్లమ్మ మానసిక రోగి అన్నదని, 335 00:27:07,043 --> 00:27:10,463 నాకు అదేం తెలియదని, లెనన్ ఇప్పుడే వెళ్లబోసుకుంది. 336 00:27:10,546 --> 00:27:12,506 ఆమె నేరం ఒప్పుకుంటుందనుకున్నాను, 337 00:27:13,215 --> 00:27:15,926 కానీ మనం వాళ్ల అమ్మతోనే చెప్పించవచ్చు. 338 00:27:16,093 --> 00:27:17,428 ఆమె ఎందుకు చేస్తుంది? 339 00:27:18,012 --> 00:27:21,140 మంచి తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేయాలనుకుంటారు. 340 00:27:21,557 --> 00:27:24,060 తన పిల్లలను వదిలేసి చనిపోయినట్లు నటించింది. 341 00:27:25,436 --> 00:27:30,358 నిజమే. నిజం చెప్పకపోతే పోలీసులకు చెబుతామని బెదిరిద్దాం. 342 00:27:30,441 --> 00:27:35,154 - చూడు, ఆమె మనకు దొరికితే చాలు. - ఆమె క్లారా ఇంట్లో ఉందనుకుంటాను. 343 00:27:36,155 --> 00:27:37,990 ఆ విషయం నీకు ఎలా తెలుసు? 344 00:27:38,074 --> 00:27:41,452 ఒక కారు అక్కడ ఆగి ఉండడం చూశా. బ్రూస్ కూడా ఆ సముదాయం వాడే. 345 00:27:41,827 --> 00:27:45,790 - వాళ్ల అమ్మ కూడా అందులో ఉండవచ్చు. - వాళ్లు ఉపాసకులు, సముదాయం కాదు. 346 00:27:45,873 --> 00:27:48,459 నీ మాటలతో నన్ను ఇబ్బంది పెడుతున్నావు. 347 00:27:48,542 --> 00:27:51,379 - ఆమె అక్కడ ఉందేమో వెళ్లి చూడమంటావా? - అసలే వద్దు. 348 00:27:51,587 --> 00:27:56,258 ఇది మనస్తత్వానికి సంబంధించింది. అది నీకు పెద్దగా తెలియదు. 349 00:27:56,342 --> 00:27:59,720 హ్యాక్ చేయు. నకిలీ లెనన్‌ను ఎప్పుడు బయటపెట్టాలో చెబుతాను. 350 00:28:00,179 --> 00:28:04,308 - వారంత అధ్వానంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. - అంతకంటే ఘోరంగా ఉన్నారు. 351 00:28:53,441 --> 00:28:55,651 హేయ్, వైనానీ, మా నాన్న కనిపించాడా? 352 00:28:56,235 --> 00:28:58,737 కొంతకాలంగా చూడలేదు. తినడానికి ఏమైనా కావాలా? 353 00:28:58,821 --> 00:29:02,158 వద్దు. అతను కనిపిస్తే, నేను వెతుకుతున్నానని చెబుతావా? 354 00:29:02,241 --> 00:29:03,742 అతను ఫోన్ ఎత్తడం లేదు. 355 00:29:11,667 --> 00:29:12,626 వ్యక్తిగత స్థలం వేట - పాదయాత్ర - దురాక్రమణ నిషిద్ధం 356 00:29:12,710 --> 00:29:13,627 ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడును 357 00:29:19,383 --> 00:29:20,384 హలో? 358 00:29:29,059 --> 00:29:30,227 హెలెన్? 359 00:29:44,950 --> 00:29:48,204 నేను, మార్గో గిల్బర్ట్‌ను. 360 00:29:49,455 --> 00:29:52,791 గుర్తుందా? నేను లెనన్ ఆప్తమిత్రురాలిని. 361 00:29:59,590 --> 00:30:00,633 హలో? 362 00:30:07,598 --> 00:30:08,641 హెలెన్? 363 00:30:21,779 --> 00:30:23,781 నాన్నా, ఎక్కడున్నారు? ఫోన్ చేయండి. 364 00:30:49,807 --> 00:30:50,808 హలో? 365 00:31:07,575 --> 00:31:08,742 హలో? 366 00:31:22,840 --> 00:31:23,966 హెలెన్? 367 00:31:46,739 --> 00:31:47,781 హెలెన్? 368 00:31:59,293 --> 00:32:00,461 ఎవరైనా ఉన్నారా? 369 00:32:32,743 --> 00:32:36,538 - ఏమైంది, డిలన్? - మీ ఇంటి కిటికీల తాళాలు బాగు చేయించు. 370 00:32:37,206 --> 00:32:38,374 నువ్వు వెళ్లిపో. 371 00:32:39,875 --> 00:32:42,544 - అది నన్ను భయపెట్టదు. - పెడుతుంది. 372 00:32:42,711 --> 00:32:44,505 మరో అవకాశం ఇవ్వడానికి వచ్చాను. 373 00:32:45,923 --> 00:32:50,094 నువ్వు నిజం చెప్తే, నీకు విముక్తి కలగడానికి సహాయం చేస్తాను. 374 00:32:51,470 --> 00:32:53,305 క్లారాకి విముక్తినిచ్చినట్లా? 375 00:32:53,389 --> 00:32:58,227 ఆమె అదే కోరుకుంది. వచ్చే జన్మలో ముక్తి కోరుకుంది. 376 00:32:59,770 --> 00:33:03,482 - దాని అర్థం ఏంటి? - ఆమెను కాలజ్ఞానానికి సిద్ధం చేశాను. 377 00:33:04,066 --> 00:33:08,028 - నిన్ను చూస్తే నాకు భయమేస్తోంది. - కత్తి పట్టుకున్నది నువ్వు. 378 00:33:09,655 --> 00:33:12,241 ఆలిసన్ మంచం మీద నీ చీటీ దొరికింది. 379 00:33:13,951 --> 00:33:16,078 ఆమెకు సహాయంగా నేనున్నానని తెలియాలని, 380 00:33:16,453 --> 00:33:21,291 ఆమె చనిపోయిందని, ఆ స్థానంలోకి నువ్వు వచ్చావని తెలియక ముందు రాశాను. 381 00:33:21,625 --> 00:33:24,670 - నా వెంట పడుతున్న వీడియో ఉంది. - నేనెప్పుడూ పడలేదు. 382 00:33:24,753 --> 00:33:26,755 వెంట పడి, నిఘా వేయడాన్ని ఏమనాలి? 383 00:33:26,839 --> 00:33:29,174 డేల్‌ను అనుమానించేలా చేశావు. అది నువ్వే. 384 00:33:29,258 --> 00:33:31,844 నువ్వు, అందరు ఎలా ఉన్నారో తెలుసుకున్నాను. 385 00:33:32,469 --> 00:33:35,347 ప్రతిరోజు సముద్రపు ఆటు ఉన్నప్పుడు. 386 00:33:36,974 --> 00:33:38,934 అలా చేయకుండా ఉండలేను. 387 00:33:39,768 --> 00:33:42,187 నీకు మతిస్థిమితం లేక అలా చేస్తావు. 388 00:33:43,313 --> 00:33:44,189 అది ఓసీడీ. 389 00:33:44,398 --> 00:33:46,900 మనుషుల్ని చంపకుండా కూడా ఉండలేవేమో. 390 00:33:46,984 --> 00:33:48,026 నేను అలా చేయలేదు. 391 00:33:48,861 --> 00:33:54,199 నా బుర్ర పాడు చేయకుండా, అసలు నిజం చెప్పు. 392 00:33:54,324 --> 00:33:56,285 నాకు నిజం తెలియకుంటే? 393 00:34:00,664 --> 00:34:01,707 ఛ. 394 00:34:02,833 --> 00:34:03,792 మార్గో? 395 00:34:03,876 --> 00:34:07,212 నువ్వు, డిలన్ వెంటనే ఇక్కడికి రావాలి, లెనన్. 396 00:34:07,296 --> 00:34:10,257 - ఎక్కడ ఉన్నావు? - నేను అనుకున్నదంతా తప్పే. 397 00:34:16,680 --> 00:34:17,890 మనం ఆమెను వెతకాలి. 398 00:34:22,352 --> 00:34:23,395 క్లారా ఇంట్లో. 399 00:34:28,692 --> 00:34:29,860 నీకెలా తెలుసు? 400 00:34:33,405 --> 00:34:34,490 మనం వెళ్లాలి. 401 00:34:40,621 --> 00:34:44,458 - తేడా కనిపెట్టగలవా? - నగ్న శరీరాలయితే మేలు. 402 00:34:45,793 --> 00:34:48,212 చిన్న చిన్న తేడాలను చూడడానికి. 403 00:34:48,295 --> 00:34:51,590 వాళ్ల నాన్న దగ్గర అలాంటివి ఏమీ లేవు, అందుకే... 404 00:34:51,673 --> 00:34:54,259 వీటిని చనిపోయిన సోదరితో పోల్చి చూస్తాను. 405 00:34:54,718 --> 00:34:57,471 ధన్యవాదాలు. బ్రతికున్నదెవరో నాకు తెలియాలి. 406 00:35:06,605 --> 00:35:08,607 - ఆమె చనిపోయింది. - తెలుస్తూనే ఉంది. 407 00:35:08,774 --> 00:35:12,319 లేదు. నా ఫోన్. మార్గో ఎక్కడుందో నాకు కనిపించడం లేదు. 408 00:35:20,285 --> 00:35:23,747 - మనం కలిసి ఉండాలి. - అవును, సరే. 409 00:35:27,626 --> 00:35:31,046 ఇంతకు ముందు జరిగిన దానికి మన్నించు. 410 00:35:31,129 --> 00:35:34,258 మతిస్థిమితం లేదని అన్నాను. 411 00:35:35,342 --> 00:35:39,263 - బహుశా లేకపోవచ్చు. - నీ మాటలు ధైర్యాన్ని ఇవ్వవు. 412 00:35:43,642 --> 00:35:44,893 అలాంటి దానివేనేమో. 413 00:36:01,326 --> 00:36:05,205 - ఏమైంది? - ఆమె మా అమ్మ. 414 00:36:08,292 --> 00:36:09,960 ఓరి దేవుడా. 415 00:36:11,461 --> 00:36:12,504 మన్నించు. 416 00:36:16,800 --> 00:36:20,345 మార్గో సైగ చేస్తుందేమో అనుకున్నాను. 417 00:36:22,931 --> 00:36:23,974 ఏం సైగ? 418 00:36:26,226 --> 00:36:28,937 ఏం లేదు. మన పోలీసులకు ఫోన్ చేయాలి. 419 00:36:30,814 --> 00:36:31,982 అది వినపడిందా? 420 00:36:36,320 --> 00:36:37,279 హలో? 421 00:36:41,867 --> 00:36:44,036 హలో? హలో? వినబడుతోందా? 422 00:36:48,957 --> 00:36:51,668 - హలో? - మార్గో, అది నువ్వేనా? 423 00:36:54,004 --> 00:36:55,964 నీకు వినబడితే, మాకు సహాయం కావాలి. 424 00:36:58,926 --> 00:37:00,177 హేయ్, అయిపోయిందా? 425 00:37:03,221 --> 00:37:04,097 డిలన్? 426 00:37:06,808 --> 00:37:09,019 - డిలన్. - లెనన్? 427 00:37:28,622 --> 00:37:29,748 లెనన్? 428 00:37:48,684 --> 00:37:50,394 ఓరి దేవుడా. అయ్యో. 429 00:37:51,728 --> 00:37:53,605 పైకి లే. ఏమైంది? ఏం కాలేదు కదా? 430 00:37:54,064 --> 00:37:56,692 నీ ఫోన్ ఇవ్వు. మనం అంబులెన్సుకు ఫోన్ చేయాలి. 431 00:37:57,985 --> 00:37:59,528 నీకు ఎవరు ఇలా చేశారు? 432 00:38:03,281 --> 00:38:04,408 నువ్వే చేశావు. 433 00:38:07,661 --> 00:38:08,704 ఏంటి? 434 00:38:19,172 --> 00:38:20,799 మా అమ్మను చంపేశావా? 435 00:38:22,592 --> 00:38:26,638 ఆమె నిన్ను చాలా బాధ పెట్టింది. ఆమెను ఊరికే వదిలి పెట్టలేకపోయాను. 436 00:38:30,017 --> 00:38:34,896 ఆమె చేసింది చాలా ఘోరమైన పనే, 437 00:38:36,940 --> 00:38:38,525 కానీ అది నాకు పరవాలేదు. 438 00:38:38,859 --> 00:38:42,404 అది నీ కోసం చేయలేదు. లెనన్ కోసం చేశాను. 439 00:38:46,700 --> 00:38:51,413 - నేను లెనన్‌ను. - కాదు. నిజమైన లెనన్. 440 00:38:52,205 --> 00:38:55,876 నేను ప్రేమించినది, నువ్వు చంపినది. 441 00:38:55,959 --> 00:39:00,172 - నీకు డెలన్ ఏం చెప్పాడో నాకు తెలియదు... - నాకు డెలన్చెప్పనవసరం లేదు. 442 00:39:00,255 --> 00:39:03,508 నువ్వు కనిపించకుండా పోయినప్పుడు సోషల్ మీడియాలో చూశాను. 443 00:39:03,592 --> 00:39:06,428 నీ యాంగిల్స్, హ్యాష్‌ట్యాగ్లు తప్పు. బాగోలేదు. 444 00:39:06,762 --> 00:39:11,558 అప్పుడు నా పరిస్థితి బాగాలేదు. వదిలేయు, మార్గో. 445 00:39:15,312 --> 00:39:16,938 నేను ఎవరో నీకు తెలుసు. 446 00:39:23,070 --> 00:39:24,112 అవును. 447 00:39:27,407 --> 00:39:28,742 పనికిమాలిన ఆలిసన్‌వు. 448 00:39:45,801 --> 00:39:47,511 - హాయ్, బ్రూస్. - హాయ్, మే. 449 00:39:48,220 --> 00:39:52,099 లెనన్ మీ ఇంట్లో ఉందా? ఫోన్ చేస్తే వాయిస్ మెయిల్‌కు వెళుతోంది. 450 00:39:52,432 --> 00:39:55,393 ఆమె ఇక్కడ లేదు, కానీ ఆప్తమిత్రులు కలిసే ఉంటారు. 451 00:39:55,477 --> 00:39:57,270 ఫైండ్ మై ఫ్రెండ్స్‌ చూస్తాను. 452 00:39:58,146 --> 00:40:00,774 నేను కూడా లెనన్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. 453 00:40:00,857 --> 00:40:03,568 పిల్లల్ని పెంచాలంటే గూఢచర్యం కూడా చేయాలి. 454 00:40:04,277 --> 00:40:06,530 మార్గో ఎక్కడుందో చెప్పలేను. దిగులుపడకు. 455 00:40:06,613 --> 00:40:10,158 ఆమె కాలిఫోర్నియా నుండి వచ్చాక, కైల్ ఆమెపై కన్నేసి ఉంచాడు. 456 00:40:11,576 --> 00:40:14,746 అవును. మంచిది. ధన్యవాదాలు, మే. 457 00:40:30,804 --> 00:40:31,847 మార్గో, వద్దు. 458 00:40:31,930 --> 00:40:34,558 నీకు నిజం చెప్పడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాను. 459 00:40:35,100 --> 00:40:39,604 ఆ మేక తల నువ్వు చేసిన మరో పనికని చెప్పాను. 460 00:40:42,607 --> 00:40:46,778 నువ్వు ప్రేమించావనే జానీని నేను చంపేసిన తర్వాత కూడా 461 00:40:47,279 --> 00:40:49,656 మనసు విరిగి, నిజం చెప్పకుండా ఎలా ఉన్నావు? 462 00:40:53,076 --> 00:40:54,619 నిజమే చెబుతున్నాను. 463 00:40:54,786 --> 00:41:00,208 ఎలాంటివాళ్లు తమ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి అందరినీ చావనిస్తారు. 464 00:41:01,751 --> 00:41:05,255 మార్గో, విను. కాస్త ఆలోచించు. 465 00:41:06,464 --> 00:41:10,635 నా పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో, ఏది దాచి పెడతానో నీకు తెలుసు. 466 00:41:10,969 --> 00:41:12,053 నోర్ముయ్. 467 00:41:13,096 --> 00:41:16,766 నా మచ్చల సంగతి ఏంటి? అవి ఎలా అయ్యాయో నీకొక్కదానికే తెలుసు. 468 00:41:16,850 --> 00:41:20,103 లేదు, ఆమెలాగే నువ్వు నన్ను తప్పుదోవ పట్టిస్తున్నావు. 469 00:41:20,478 --> 00:41:22,731 ఏం చేస్తున్నావో తెలియదనుకుంటున్నావా, 470 00:41:22,814 --> 00:41:25,358 ముద్దు పెట్టి, బరితెగించి నటించినప్పుడు? 471 00:41:25,692 --> 00:41:29,738 - అచ్చం లెనన్‌లా. - ఎందుకంటే నేను లెనన్‌ను. 472 00:41:33,408 --> 00:41:35,702 హాఫ్‌మన్‌లో ఉన్నప్పుడు నమ్మసాగాను. 473 00:41:37,746 --> 00:41:39,664 నేను పొరబడ్డానేమో అనుకున్నాను. 474 00:41:42,375 --> 00:41:44,085 అచ్చం ఆమెలా ఉన్నావు. 475 00:41:46,463 --> 00:41:47,964 నన్ను నిజంగా ప్రేమించావు. 476 00:41:51,551 --> 00:41:55,680 - నేను నిన్ను ప్రేమిస్తున్నాను. - మరి డిలన్‌ను ఎందుకు ఎంచుకున్నావు? 477 00:41:57,974 --> 00:41:59,226 లేదు. 478 00:42:01,186 --> 00:42:03,396 ఎల్లప్పుడూ నీ కోసం వచ్చాను. 479 00:42:05,065 --> 00:42:07,859 ఆ రాత్రి నుండి. అది నీకు తెలుసు. 480 00:42:11,071 --> 00:42:14,074 - వద్దు. ఇక్కడికి రావద్దు. - దయచేసి... 481 00:42:16,076 --> 00:42:19,913 ఓరి దేవుడా. అయ్యో. హేయ్. 482 00:42:20,372 --> 00:42:21,456 ఆమె చనిపోయింది. 483 00:42:23,250 --> 00:42:26,169 ఏం కాదు. ఇక్కడే ఉన్నాను, సరేనా? 484 00:42:26,920 --> 00:42:28,546 మనం చూసుకుంటాం, సరేనా? 485 00:42:30,257 --> 00:42:31,424 మాటిస్తున్నాను. 486 00:42:36,388 --> 00:42:38,932 మునుపెన్నడు ఎవరు నన్ను అంతలా ప్రేమించలేదు. 487 00:42:42,894 --> 00:42:47,190 నేను నీ గురించి బాధపడాలనుకుంటున్నావా? ఒసేయ్, నన్ను కూడా ఎవరూ ప్రేమించరు. 488 00:42:48,191 --> 00:42:49,317 నేను ప్రేమిస్తున్నా 489 00:42:51,945 --> 00:42:56,866 - నేను నిన్ను పొడిచాను. - నాకు తెలుసు, ఇది అర్థం కాదు. 490 00:42:56,950 --> 00:42:59,995 అర్థం అవుతుంది. నిన్ను కాపాడుకోవాలనుకుంటున్నావు. 491 00:43:00,328 --> 00:43:03,290 అలాగే కనిపిస్తుందని నాకు తెలుసు, కానీ ఒట్టు, 492 00:43:05,834 --> 00:43:09,045 ఆ రాత్రి నువ్వు నాకు సహాయం చేసినట్లు నీకు చేస్తున్నాను. 493 00:43:12,590 --> 00:43:14,217 నాకు నీ సహాయం అవసరం లేదు. 494 00:43:40,618 --> 00:43:41,619 ఛ. 495 00:43:51,963 --> 00:43:53,423 ఛ. ఆలిసన్. 496 00:43:56,176 --> 00:44:00,347 అయితే ఇదంతా నేను చేసినట్లు కనిపించాలనా? 497 00:44:01,931 --> 00:44:03,600 అసలు పథకం అదే. 498 00:44:04,434 --> 00:44:08,104 అది పని చేసేది, కానీ ఆ తరువాత అనుకున్నాను... 499 00:44:09,397 --> 00:44:14,402 నాలాంటి వాళ్లకు పిచ్చెక్కిస్తున్నావని తెలిసి ఊరుకోలేకపోయా. 500 00:44:16,780 --> 00:44:17,947 నన్ను మన్నించు. 501 00:44:24,079 --> 00:44:26,331 అసలైన లెనన్ క్షమాపణ అడగదు. 502 00:44:28,833 --> 00:44:33,838 లేదమ్మా, వాడు సౌత్ పార్క్ చూడకూడదు. అది నీకు సరదాగా ఉన్నా లెక్క చేయను. 503 00:44:35,131 --> 00:44:36,341 నేను వెళ్లాలి. 504 00:44:38,760 --> 00:44:40,387 - కలేకి కలుపు. - హేయ్, చీఫ్. 505 00:44:40,970 --> 00:44:44,516 ఎనిమిది నిమిషాల క్రితం ఎవరో 911కు ఫోన్ చేసి పెట్టేశారు. 506 00:44:44,599 --> 00:44:47,102 అది క్లారా వెదర్స్ పాత ఇంటిదని కనిపెట్టాను. 507 00:44:47,185 --> 00:44:50,021 తిరిగి ఫోన్ చేయలేదు. నేను వెళ్లి చూడాలా? 508 00:44:50,647 --> 00:44:54,567 - దగ్గరలో ఉన్నాను. వెళ్లి చూస్తాను. - సరే. భద్రం. 509 00:45:05,495 --> 00:45:06,371 ఆలిసన్. 510 00:45:08,915 --> 00:45:09,958 మార్గో. 511 00:45:13,962 --> 00:45:18,591 ఛ. కదలొద్దు. మనం 911కు ఫోన్ చేయాలి, సరేనా? 512 00:45:20,969 --> 00:45:24,806 చింతించకు. నువ్వు అది ముట్టుకోవచ్చు. నీ డీఎన్ఏ అంతటా ఉంది. 513 00:45:25,014 --> 00:45:26,641 అసలు నీకు ఏమైంది? 514 00:45:26,724 --> 00:45:28,893 కండోమ్‌లు తెగ పడేసేది నేను కాదు. 515 00:45:28,977 --> 00:45:29,894 ఆమె చనిపోతుంది. 516 00:45:33,106 --> 00:45:34,774 ఆమె తప్పకుండా చనిపోతుంది. 517 00:45:40,405 --> 00:45:41,906 కాల్పులు. సాయం కావాలి. 518 00:45:44,617 --> 00:45:47,162 దానితో ఏం చేస్తావు, అహింసావాది? 519 00:45:47,245 --> 00:45:48,621 నీ ఫోన్ ఇవ్వు. 520 00:45:51,791 --> 00:45:53,668 దయచేసి నన్ను కాల్చొద్దు. 521 00:45:55,962 --> 00:45:58,173 - దేవుని దయవల్ల వచ్చారు. - నోర్ముయ్. 522 00:45:58,256 --> 00:45:59,382 తుపాకీ పడేయు. 523 00:46:01,551 --> 00:46:04,971 మోకాళ్లపై కూర్చో. చేతులెత్తు. క్లారా ఇంటికి అంబులెన్స్ పంపు 524 00:46:05,054 --> 00:46:07,348 - అతను మా ఇద్దర్ని చంపబోయాడు. - ఇక ఆపు. 525 00:46:07,432 --> 00:46:10,935 ఆలిసన్‌ను పొడిచింది. ఆమెను కాల్చబోతుంటే తుపాకీ లాక్కున్నాను. 526 00:46:11,019 --> 00:46:15,690 - అబద్ధం. ఆమె నా ఆప్తమిత్రురాలు. - మోకాళ్లపై కూర్చో. చేతులు తలపై పెట్టుకో. 527 00:46:20,403 --> 00:46:23,281 ధైర్యంగా ఉండు, సరేనా? అంబులెన్స్ వచ్చేస్తోంది. 528 00:46:23,364 --> 00:46:24,782 మా నాన్న... 529 00:46:25,575 --> 00:46:27,744 ఫోన్ చేస్తాను. ఏం జరిగిందో చెబుతావా? 530 00:46:29,037 --> 00:46:32,749 హేయ్, నువ్వు నిజం చెబితే నీకు ఎవరూ హాని చేయరు. 531 00:46:33,374 --> 00:46:34,667 నేనెందుకు హాని చేస్తా 532 00:46:38,129 --> 00:46:39,506 నిన్ను ప్రేమిస్తున్నా. 533 00:46:54,062 --> 00:46:55,230 ఇది డెలన్. 534 00:46:57,899 --> 00:46:58,775 ఏంటి? 535 00:47:00,360 --> 00:47:04,405 లేదు, లేదు. మార్గో పొడిచింది... ఇలా ఎందుకు చేస్తున్నావు? 536 00:47:05,323 --> 00:47:09,202 లేదు, మార్గో పొడిచింది. వాళ్ల అమ్మను చంపింది. రాళ్లగదిలో చూడండి. 537 00:47:09,285 --> 00:47:12,997 దేవుడు మీద ఒట్టు, నేను ఈ పని చేయలేదు. అయ్యయ్యో. 538 00:47:13,081 --> 00:47:15,625 అసలు నీకు ఏమైంది? కాస్త నిజం చెప్పు. 539 00:47:15,708 --> 00:47:18,461 - సరే, కదా. - అయ్యో. 540 00:47:24,384 --> 00:47:26,803 మార్గో పొడిచింది. వాళ్ల అమ్మను చంపింది. 541 00:47:26,886 --> 00:47:28,972 కాస్త రాళ్లగదిలో చూడండి. 542 00:48:03,256 --> 00:48:05,258 మన్నించండి. హేయ్, ఆమె ఎక్కడ ఉంది? 543 00:48:05,341 --> 00:48:08,094 ఆస్పత్రి తీసుకెళ్లారు. ఆమె బాగానే ఉంది, సరేనా? 544 00:48:08,177 --> 00:48:09,345 నన్ను ఇరికించారు. 545 00:48:10,680 --> 00:48:14,058 మార్గో ఆమెను కాల్చబోయింది. నా వీర్యం కత్తిమీద పూసింది. 546 00:48:14,142 --> 00:48:17,520 అక్కడ ఆలిసన్ తల్లి ఉంది... ఆమె అక్కడే ఉంది. ఒట్టు. 547 00:48:17,604 --> 00:48:21,482 మార్గో అందరిని చంపింది. గ్రాంట్ గారు. నేను చేయలేదని మీకు తెలుసు. 548 00:48:22,900 --> 00:48:25,737 - జీవితంలో ఒకసారైనా నిజం చెప్పు. - ఇక చాలు. 549 00:48:28,656 --> 00:48:32,368 సహాయం చేస్తాను. ఇంకా ఆలస్యం కాలేదు. నీకు విముక్తి కలిగిస్తాను. 550 00:48:35,663 --> 00:48:38,458 మన్నించు. అతనికి మానసిక పరీక్ష చేయించాల్సింది. 551 00:48:38,541 --> 00:48:41,544 - అతను హాని తలపెడతాడని అనుకోలేదు. - అవును, నేను కూడా. 552 00:48:42,211 --> 00:48:44,964 తనను అతనే పొడిచాడని లెనన్ చెప్పింది. 553 00:48:46,507 --> 00:48:50,762 - ఆ హెలెన్ సంగతి ఏంటి? - మాకు ఎలాంటి ఆధారం దొరకలేదు. 554 00:48:51,804 --> 00:48:53,931 ఎలా దొరుకుతుంది? ఎప్పుడో చనిపోయింది. 555 00:48:54,849 --> 00:48:57,101 అవును. లెనన్ ఆస్పత్రికి చేరుకుంటుంది. 556 00:49:12,867 --> 00:49:18,081 నన్ను క్లిష్ట పరిస్థితిలో పడేశావని నీకు తెలుసు. 557 00:49:19,165 --> 00:49:21,584 దారిలో ఉన్నాం. ఇరవై ఏండ్లున్న మహిళ. 558 00:49:21,668 --> 00:49:24,337 కడుపులో కత్తి గాయం. చాలా రక్తం పోయింది. 559 00:49:24,420 --> 00:49:27,131 అంటే, నేను ఏం చేశానో నీకు తెలుసు. 560 00:49:29,342 --> 00:49:31,010 అయినా నన్ను ఎంచుకున్నావు. 561 00:49:34,013 --> 00:49:36,224 అసలు నీకు ఏమైంది? 562 00:49:42,230 --> 00:49:44,023 మీ పేరు ఏదైతేనేం. 563 00:49:47,318 --> 00:49:50,905 నా జీవితంలో ఎవరినీ ఇంతగా ప్రేమించలేదు. 564 00:50:07,338 --> 00:50:11,509 నా కొడుకుది సున్నిత మనస్తత్వం. చీమకు కూడా హాని తలపెట్టడు. 565 00:50:13,553 --> 00:50:17,765 దీని నుండి తప్పించుకోలేవు. మేము ఎవరో నీకు తెలుసా? 566 00:50:19,642 --> 00:50:22,562 ఆర్కిటిక్ వేట సాలీడులు, రైలీ థాకర్ చేయితో పాటు 567 00:50:22,645 --> 00:50:25,940 ఆలిసన్ గ్రాంట్ కంప్యూటర్, ఫోన్‌లు వాళ్లకు దొరికాయి. 568 00:50:29,819 --> 00:50:33,489 కావాలంటే మీ న్యాయవాదిని వెనక్కి పిలిపిస్తాను. 569 00:50:35,908 --> 00:50:38,035 ఈ జీవితంలో ముక్తి లేదు. 570 00:50:38,828 --> 00:50:41,998 అదే చెప్పావు, కానీ మార్గో చేసిందని కూడా చెప్పావు. 571 00:50:42,206 --> 00:50:43,958 లెనన్ అలా చెప్పలేదని తెలుసు, 572 00:50:44,041 --> 00:50:46,919 కానీ నీ కథనం కూడా వినాలనుకుంటున్నాను. 573 00:50:49,881 --> 00:50:51,174 ఆమె పేరు ఆలిసన్. 574 00:50:52,675 --> 00:50:54,177 పనికొచ్చేది చెప్పడం లేదు. 575 00:50:54,635 --> 00:50:58,848 దీనితో లాభం లేకపోవచ్చు, కానీ ఆ కవలల్లో తేడా కనిపెట్టాను. 576 00:50:59,557 --> 00:51:00,683 చాలా ఉంటుంది. 577 00:51:01,601 --> 00:51:03,853 సూక్ష్మ పరిశీలన తర్వాత, 578 00:51:04,187 --> 00:51:07,815 ఆలిసన్ చెవి పైభాగాన రంధ్రం కనిపించింది. 579 00:51:08,024 --> 00:51:09,358 మరి మృతదేహంపై? 580 00:51:11,360 --> 00:51:12,361 అదే రంధ్రం ఉంది. 581 00:51:13,821 --> 00:51:17,366 ఆలిసన్ గ్రాంట్ ఆత్మ హత్యకు గురైనట్టు ఇది ధ్రువీకరిస్తోంది. 582 00:51:18,159 --> 00:51:19,202 ధన్యవాదాలు, వేడ్. 583 00:51:24,207 --> 00:51:25,458 ఇప్పుడు లెనన్‌వు. 584 00:51:27,043 --> 00:51:28,544 ఆలిసన్ పారిపోయింది. 585 00:51:29,378 --> 00:51:32,089 నువ్వు సృష్టించావు. మనమిద్దరం దానితో జీవించాలి. 586 00:51:33,257 --> 00:51:34,342 నేను చేయలేకపోతే? 587 00:51:37,178 --> 00:51:38,679 ఎవరికీ తెలియదు. 588 00:51:48,314 --> 00:51:51,400 - ఎలా ఉన్నావు? - నొప్పిగా ఉంది. 589 00:51:53,027 --> 00:51:56,948 కొన్నాళ్లు నొప్పి ఉండవచ్చు. నువ్వు అదృష్టవంతురాలివి. 590 00:51:59,283 --> 00:52:00,326 అవును, తెలుసు. 591 00:52:02,703 --> 00:52:03,788 బంగారం... 592 00:52:10,294 --> 00:52:11,921 మీ అమ్మకు ఏమైంది? 593 00:52:17,218 --> 00:52:18,427 నాకు తెలియదు. 594 00:52:20,930 --> 00:52:22,056 సరే మంచిది. 595 00:52:24,308 --> 00:52:25,434 కాస్త నిద్రపో. 596 00:52:28,646 --> 00:52:31,065 చాలా ఘోరమైన దాన్నని తప్పక అనుకుంటారు. 597 00:52:34,443 --> 00:52:37,029 మీరైతే పూర్తిగా మరోలా చేసేవారని. 598 00:52:39,282 --> 00:52:40,992 నేను కూడా అలాగే అనుకున్నాను. 599 00:52:56,507 --> 00:52:59,510 అంటే, ఇలాంటివి మీరు ఎప్పుడూ వింటూనే ఉంటారు. 600 00:53:00,428 --> 00:53:03,598 ఎల్లప్పుడు సమాధానం స్పష్టంగా తెలుస్తుంది. 601 00:53:08,060 --> 00:53:09,186 అలాగే జరుగుతుంది. 602 00:53:11,439 --> 00:53:13,024 అది మీకు జరిగే వరకు. 603 00:53:18,237 --> 00:53:21,198 అకస్మాత్తుగా అంతా మారిపోతుంది. 604 00:53:23,659 --> 00:53:25,703 సరిగ్గా ఆలోచించుకోలేరు. 605 00:53:28,205 --> 00:53:30,666 పర్యవసానం గురించి ఆలోచన ఉండదు. 606 00:53:34,045 --> 00:53:35,588 అవి తర్వాతి విషయాలు. 607 00:53:35,880 --> 00:53:38,049 నువ్వు ఏం చేశావో నాకు తెలుసు 608 00:53:38,132 --> 00:53:39,300 లెనన్. 609 00:53:42,970 --> 00:53:47,224 ఆ క్షణాన మీలోని లోతైన, రహస్యమైనదే ఉంటుంది. 610 00:53:49,018 --> 00:53:50,519 ఒక నిర్ణయం తీసుకోవాలి. 611 00:53:51,437 --> 00:53:52,813 పునర్జన్మ 612 00:53:52,897 --> 00:53:56,651 అక్కడ ఆగిపోవడం గాని, వెనక్కి తిరగడం గాని ఉండవు. 613 00:53:57,985 --> 00:53:59,737 నన్ను వదిలిపెట్టొద్దు, సరేనా? 614 00:54:01,656 --> 00:54:02,698 ఎప్పుడూ. 615 00:54:09,997 --> 00:54:11,582 వెనక్కి తిరగలేము. 616 00:54:14,502 --> 00:54:15,753 అది జరిగిపోయింది. 617 00:54:23,511 --> 00:54:25,388 ఒకే ప్రశ్న ఉంటుంది... 618 00:54:27,181 --> 00:54:28,641 మీరు దాన్ని భరించగలరా? 619 00:54:47,743 --> 00:54:50,287 ఇది వ్యక్తిగత కథ సమయం, 620 00:54:50,621 --> 00:54:53,249 ఎందుకంటే నా బంగారానికి అంతా చెప్పేయాలి. 621 00:54:54,500 --> 00:54:57,628 అంటే, డెలన్ ఉపాసకుల పిచ్చి వల్ల ఇది చాలా సులభమైంది. 622 00:54:57,837 --> 00:55:01,590 నేను చేసిందల్లా కొన్ని వస్తువులు పెట్టడమే. ఆలిసన్ ఫోన్‌లాంటిది. 623 00:55:01,924 --> 00:55:06,262 ప్రమాదం జరిగిన తర్వాత, రైలీ దాన్ని దొంగిలించకుండా తీసుకున్నాను. 624 00:55:06,345 --> 00:55:08,848 యాప్ ద్వారా సమయానుసారం సందేశాలు పంపేదాన్ని. 625 00:55:09,265 --> 00:55:13,310 మేక తల విషయం చాలా సరదాగా ఉంటుందని డేల్‌కు చెప్పాను. 626 00:55:13,728 --> 00:55:18,190 వాడు అల్మారాలో పెట్టాడు, కానీ నోరు మూసుకుని ఉండలేకపోయాడు. 627 00:55:18,274 --> 00:55:22,194 నన్ను బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. అది చట్ట విరుద్ధం. అందుకే... 628 00:55:22,695 --> 00:55:25,072 ఆ పని కైల్ లేకుండా చేయలేకపోయేదాన్ని. 629 00:55:25,239 --> 00:55:27,033 జానీ సంఘటన అతను అంతా చూశాడు. 630 00:55:27,116 --> 00:55:30,244 భయంతో నాన్నతో సంబంధం పెట్టుకున్నట్టు అమ్మకి చెప్పా. 631 00:55:30,327 --> 00:55:34,749 కానీ అతను నిశ్చింతగా ఉన్నాడు. అంటే, నన్ను కిటికీలోంచి తోసేశాడు కూడా. 632 00:55:34,832 --> 00:55:37,877 నేను ఇబ్బందుల్లో పడకుండా చూడడమే తన పని అని చెప్పాడు. 633 00:55:38,127 --> 00:55:41,672 డేల్‌కు మా ఓన్లీఫ్యాన్స్ అకౌంట్ నుండి బిట్ కాయిన్‌లు పంపాను. 634 00:55:41,756 --> 00:55:44,050 ఆఫీసర్ డగ్ తెలివైనవాడు. 635 00:55:44,383 --> 00:55:47,136 అందుకే అంత్యక్రియల దగ్గర కలవమని చెబితే... 636 00:55:48,512 --> 00:55:51,891 హెరాల్డ్ విషయం బాధగా ఉంది. అతనికి మలబద్దకం ఉండే. 637 00:55:52,349 --> 00:55:57,646 అప్పుడు నన్ను ముద్దు పెట్టుకున్నావు, కనిపించకుండా పోయావు. నాకు గందరగోళంగా ఉంది. 638 00:55:57,938 --> 00:56:02,735 క్లారా ఇంటి దగ్గర రైలీ నన్ను మానసిక రోగి అన్నప్పుడు చాలా బలహీనంగా ఉన్నాను. 639 00:56:03,069 --> 00:56:07,073 పారిపోవడానికి క్లారా ట్రక్‌లో కూర్చున్నప్పుడు, ఆమెను రోడ్డుపై చూడగానే 640 00:56:07,490 --> 00:56:10,034 నేను అదుపు తప్పాను. 641 00:56:10,493 --> 00:56:12,286 నేను కనీసం నాడి కూడా చూడలేదు. 642 00:56:12,870 --> 00:56:14,288 మా అమ్మకు పాకం కనిపించి, 643 00:56:14,371 --> 00:56:18,042 ముక్‌బ్యాంగ్ గురించి నన్ను నిలదీయకుంటే చాలా ఘోరం జరిగిపోయేది. 644 00:56:18,125 --> 00:56:20,586 అదృష్టవశాత్తూ నేను ఏడ్చి అంతా చెప్పేశాను. 645 00:56:20,711 --> 00:56:22,588 క్లారాను ఇరికించాలనే ఆమె ఉపాయం. 646 00:56:23,047 --> 00:56:25,382 అప్పటికే ఆమెకు పిచ్చిని అందరికీ తెలుసు. 647 00:56:25,466 --> 00:56:28,552 దృష్టి మళ్లించి కైల్‌తో సాలీడుల దొంగతనం చేయించింది. 648 00:56:28,636 --> 00:56:34,058 ఆ తెలివి తక్కువ కోర్ట్నీ నోరు మూసుకుని ఉంటే, అది అంతటితో అయిపోయేది. 649 00:56:34,350 --> 00:56:36,644 కానీ కైల్ ఆమె సంగతి కూడా చూసుకున్నాడు. 650 00:56:36,727 --> 00:56:38,646 క్లారా ఆత్మహత్య చేసుకుంది. 651 00:56:38,729 --> 00:56:42,817 అది కేవలం యాదృచ్ఛికం, కానీ పని సులభమైంది. 652 00:56:43,901 --> 00:56:47,321 ఇక ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇది ఈ శతాబ్దపు ప్రేమ కథ. 653 00:56:48,656 --> 00:56:49,657 ఉపశీర్షికలు అనువదించినది నల్లవల్లి రవిందర్ రెడ్డి 654 00:56:49,865 --> 00:56:50,866 పవన్ కుమార్క్రియేటివ్ సూపర్‌వైజర్